మధ్యదరా సముద్రం అట్టడుగున 7000 ఏండ్ల నాటి రహదారి
పురావస్తు పరిశోధనల్లోనే అత్యంత ఆశ్చర్యం గొలిపేలా సముద్రపు అడుగున 7000 ఏండ్ల నాటి రోడ్డు మార్గం బయటపడింది.మధ్యదరా సముద్రం అట్టడుగున మట్టి వెనుక ఈ పురాతన రహదారిని కనుగొన్నారు.
న్యూయార్క్ : పురావస్తు పరిశోధనల్లోనే అత్యంత ఆశ్చర్యం గొలిపేలా సముద్రపు అడుగున 7000 ఏండ్ల నాటి రోడ్డు మార్గం బయటపడింది.మధ్యదరా సముద్రం అట్టడుగున మట్టి వెనుక ఈ పురాతన రహదారిని కనుగొన్నారు. ఈ రహదారి క్రొయేషియన్ ద్వీపంలో ఉన్న కోర్కులా ద్వీపం తీరంతో హ్వార్ సంస్కృతి యొక్క మునిగిపోయిన పూర్వ స్థావరాన్ని కలుపుతుందని భావిస్తున్నారు. ఈ రహదారి నాలుగు మీటర్ల వెడల్పుతో జాగ్రత్తగా పేర్చబడిన రాతి పలకలతో రూపొందించబడిందని తెలుస్తోంది.

గత పురావస్తు పరిశోధనల్లో భాగంగా దొరికిన వుడ్‌ను రేడియోకార్బన్ అనాలిసిస్ ద్వారా పరిశీలించగా వెల్లడైన అంశాలను క్రొయేషియా యూనివర్సిటీ ఆఫ్ జదర్ పరిశోధకులు ఫేస్బుక్ పోస్ట్‌లో షేర్ చేశారు. దాదాపు 7000 సంవత్సరాల కిందట ఈ రోడ్డుపై ప్రజలు నడిచేవారని పరిశోధనలో వెల్లడైంది. నియోలిథిక్ సెటిల్మెంట్లో ఈ రహదారి భాగమని చెబుతున్నారు. హ్వార్ సంస్కృతిలో నివసించే వారిలో నైపుణ్యం కలిగిన రైతులు, పశువుల కాపరులు తీరం వెంట ఆ సమీపంలోని ద్వీపాలలో చిన్న, చిన్న సమూహాలుగా నివసించే వారు.
కొర్కులా ద్వీపంలోని వెలా లుక సమీపంలో గ్రాండినా బే వద్ద జరిగిన భూ పరిశోధనలో భాగంగా సముద్రం అట్టడుగున ఈ పురాతన రహదారిని పరిశోధకులు కనుగొన్నారు. సోలిన్ సైట్ వద్ద డైవింగ్ చేస్తున్న పురావస్తు బృందం గ్రాడినా బే యొక్క మధ్య భాగాన్ని పరిశీలించగా సోలిన్ వద్ద ఉన్న ఒక స్థిరనివాసం దాదాపు 4 నుండి 5 మీటర్ల లోతులో ఉందని అని పరిశోధకులు ఫేస్బుక్ స్టేటస్‌లో తెలిపారు. ఈ ప్రదేశంలో చెకుముకి బ్లేడ్లు, రాతి గొడ్డళ్లు వంటి నియోలిథిక్ కళాఖండాలు కూడా బయటపడ్డాయని చెప్పారు. మరోవైపు సోలిన్ సైట్ ఇంకా పూర్తిగా త్రవ్వలేదని, హ్వార్ సంస్కృతి మరియు దాని జీవన విధానం గురించి మనకు తెలియనివి ఇంకా చాలా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.
Read More
Donald Trump | లైంగిక ఆరోపణల కేసులో ట్రంప్‌కు జ్యూరీ షాక్.. భారీ జరిమానా
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
6 నెలల్లో 23 మరణశిక్షలు.. జడ్జి బదిలీ
సామాన్యుడిపై మరో పిడుగు.. పెరగనున్న సబ్బులు, వంటనూనెల ధరలు
Congress | ‘పట్టభద్రుల’ భయంలో కాంగ్రెస్ సర్కార్.. హైదరాబాద్‌లో నిరసన రద్దు.. ఢిల్లీకి పరుగు
KTR | కేటీఆర్‌తో యువ న్యాయవాదుల భేటీ.. సామాన్యులకు న్యాయం కోసం నిబద్ధతతో పనిచేయాలని లాయర్లకు పిలుపు
Tummidihatti Barrage | ‘తమ్మిడిహట్టి’పై ‘మహా’ సస్పెన్స్.. 152 మీటర్ల ఎత్తుకు ఫడ్నవీస్ ఓకే చెప్తారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

