Earthquake | భారీ భూకంపం.. పెద్ద ఎత్తున ప్రాణనష్టం
Earthquake | ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)ను భారీ భూకంపం (Earthquake) వణికించింది. దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటైన మజార్-ఎ-షరీఫ్ (Mazar-e Sharif) సమీపంలో సోమవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో భూమి కంపించింది.
Earthquake | ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)ను భారీ భూకంపం (Earthquake) వణికించింది. దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటైన మజార్-ఎ-షరీఫ్ (Mazar-e Sharif) సమీపంలో సోమవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
CCTV footage shows the moment a strong M6.3 earthquake struck Mazar-e-Sharif, Afghanistan, a short while ago. pic.twitter.com/NX0o04Ggi5
— Weather Monitor (@WeatherMonitors) November 2, 2025
యూఎస్ జియోలాజికల్ సర్వే (US Geological Survey) ప్రకారం.. మజార్-ఎ-షరీఫ్ నగరం ఖుల్మ్ పట్టణానికి సమీపంలో భూమికి 28 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రకంపనలు తీవ్ర స్థాయిలో ఉండటంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ భూప్రకంపనలకు భారీ భవంతులు ఊగిపోయాయి. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విపత్తులో ఇప్పటి వరకూ పది మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 150 మందికిపైగా గాయపడ్డారు. అయితే, మృతులు వందల్లోనే ఉంటారని యూఎస్జీఎస్ అంచనా వేసింది. భూ ప్రకంపనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
A powerful earthquake struck northern Afghanistan in the middle of the night, causing houses to collapse while residents were deeply asleep, resulting in numerous fatalities. pic.twitter.com/t4x6dNmwdQ
— Nilofar Ayoubi 🇦🇫 (@NilofarAyoubi) November 2, 2025
A Powerful #Earthquake struck #Afghanistan’s #Samangan and #Balkh Provinces late last night. According to Initial reports, Seven people have been Martyred, around 150 Injured, and a large number of Homes destroyed. #ARCS Rescue and Medical teams have arrived in the affected areas… pic.twitter.com/rMIe1V3THi
— Afghan Red Crescent | افغاني سره میاشت (@ARCSAfghanistan) November 3, 2025
Also Read..
భారతీయులపై విద్వేషం.. అమెరికాలో పెరుగుతున్న ధోరణి
Cancer | క్యాన్సర్ అంతానికి నాంది.. సార్వజనీన వ్యూహాన్ని సిద్ధం చేసిన ఫ్లోరిడా వర్సిటీ పరిశోధకులు!
22 ఏళ్లకే బిలియనీర్లుగా భారత టెకీలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

