వాషింగ్టన్, జూన్ 30: కంటి నిండా నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. ఈ విషయాన్ని తాజాగా అమెరికన్ హార్ట్ అసోషియేషన్(ఏహెచ్ఏ) అధికారికంగా స్పష్టం చేసింది. గుండె, మెదడు ఆరోగ్యవంతంగా పనిచేయడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుందని, కనీసం 7 గంటలు నిద్ర పోవడం హార్ట్‌కి మంచిదని పేర్కొన్నది. ప్రతి రోజూ రాత్రి 7-9 గంటలు సరిపడా నిద్ర వ్యవధి అని, పిల్లలు అంతకు ఎక్కువ, ఐదేండ్ల లోపు చిన్నారులకు 10-16 గంటల నిద్రను సిఫారసు చేసింది. ఈ మేరకు ఏహెచ్ఏ తాజాగా బుధవారం ప్రచురించిన తన జర్నల్‌లోని హార్ట్ హెల్త్ చెక్‌లిస్టులో నిద్ర వ్యవధిని కూడా చేర్చింది.