న్యూయార్క్: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో (Philadelphia) ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఫిలడెల్ఫియాలోని ఓ మూడంతస్తుల భవనంలో బుధవారం ఉదయం 6.40 గంటలకు (అమెరికా కాలమానం) మంటలు చెలరేగాయి. దీంతో ఏడుగురు చిన్నారులు సహా 13 మంది సజీవదహనమయ్యారు. మరో ఎనిమిది మంది క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 50 నిమిషాలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.
బిల్డింగ్‌లోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయని అగ్నిమాక శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 13 మంది మరణించగా, ఎనిమిది మంది బయటపడ్డారని చెప్పారు. వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని, వారిని దవాఖానకు తరలించామన్నారు. ఆ బిల్డింగ్‌లో మొత్తం 26 మంది ఉంటున్నారని వెల్లడించారు.