బాగ్దాద్ : తూర్పు ఇరాక్‌లో ఓ షాపింగ్ మాల్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కుట్ నగరంలో ఈ మాల్‌ను ఓ వారం క్రితమే ప్రారంభించారు. బుధవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఐదు అంతస్తులు గల ఈ మాల్ మొత్తం మంటల్లో చిక్కుకుంది.
దీంతో 61 మంది మరణించారు. పౌర రక్షణ దళాలు 45 మందిని కాపాడగలిగాయి. 14 మృతదేహాలను గుర్తించవలసి ఉంది.