Earthquake | అలస్కాలో భారీ భూకంపం.. ఐదు రోజుల్లో రెండోసారి
అమెరికాలోని అలస్కాలో (Alaska) మరోసారి భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత 6.2గా నమోదయింది. భూకంప కేంద్రం భూమికి 48 కిలోమీటర్ల లోతులు ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
Earthquake: అమెరికాలోని అలస్కాలో (Alaska) మరోసారి భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత 6.2గా నమోదయింది. భూకంప కేంద్రం భూమికి 48 కిలోమీటర్ల లోతులు ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. అయితే భూకంపం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ముందు జాగ్రత్తగా పౌరులను సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచించారు. సునామీ హెచ్చరికలు జారీచేశారు.
ఈ నెల 17న కూడా అలస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదయింది. గత బుధవారం మధ్యాహ్నం 12.37 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) భూమి కంపించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది.
భూకంపాలు తరుచుగా వచ్చే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో అలస్కా ఉంది. 1964 మార్చి నెలలో 9.2 తీవ్రతతో ఈ ప్రాంతంలో భూకంపం వచ్చింది. దీంతో 250 మందికిపైగా మరణించారు. 2023లో 7.2 తీవ్రతతో భారీ భూకంపం వచ్చినప్పటికీ పెద్దగా నష్టం సంభవించలేదు.
మరోవైపు తజికిస్థాన్‌లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. 4.6 తీవ్రతతో భూమి కంపించింది. భూ అంతర్భాగంలో 23 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని అధికారులు తెలిపారు. అంతకుముందు జూలై 18న కూడా తజికిస్థాన్‌లో 3.8 తీవ్రతతో భూమి కంపించింది.
EQ of M: 6.2, On: 21/07/2025 03:58:02 IST, Lat: 54.99 N, Long: 159.98 W, Depth: 48 Km, Location: Alaska Peninsula.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/t6cCnC8XH1— National Center for Seismology (@NCS_Earthquake) July 20, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

