కైరో: సూడాన్ పారామిలిటరీ దళాలు (ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్) శనివారం ఒందుర్‌మన్ నగరంలోని ఓ మార్కెట్‌పై విరుచుకుపడ్డాయి. విచక్షణారహితంగా దాడులు చేయడంతో 54 మంది మరణించగా, 158 మంది గాయపడ్డారు. ఈ దాడుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసం జరిగింది.
ప్రభుత్వ సైన్యం, పారామిలిటరీ అధినేతల మధ్య వైరుద్ధ్యాలు రావడంతో సూడాన్‌లో 2023 ఏప్రిల్ నుంచి అంతర్యుద్ధం జరుగుతున్నది. ఫలితంగా ఇప్పటి వరకు 28 వేల మందికిపైగా మరణించగా, లక్షలాది మంది తమ ఇళ్లను విడిచి పారిపోయారు.