PM Modi | న్యూయార్క్: క్వాడ్ కూటమి దేశాలు తమ ప్రజల మధ్య సన్నిహిత సంబంధాల బలోపేతానికి చర్యలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా క్వాడ్ భాగస్వామ్య దేశంగా భారత ప్రధాని చొరవ తీసుకున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంత దేశాలకు చెందిన 50 మంది విద్యార్థులకు అయిదు లక్షల డాలర్ల క్వాడ్ స్కాలర్ షిప్ ప్రకటించారు. భారత ప్రభుత్వ నిధులతో పనిచేస్తున్న ఇంజినీరింగ్ కాలేజీల్లో నాలుగేండ్ల బీటెక్ కోర్సు పూర్తి చేసే ఇండో-పసిఫిక్ ప్రాంత విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అందిస్తారు.