లండన్, జూన్ 9: ప్రపంచంలోని అత్యుత్తమ పాఠశాలల బహుమతికి భారత్కు చెందిన ఐదు స్కూళ్లు పలు క్యాటగిరీల్లో ఎంపికయ్యాయి. ముంబైకి చెందిన సీఎన్ఎం స్కూల్, ఢిల్లీలోని లజపత్ నగర్ ఎస్డీఎంసీ ప్రైమరీ స్కూల్ ఇన్నొవేషన్ క్యాటగిరీలో అవార్డుకు ఎంపికయ్యాయి.
అలాగే ముంబైలోని ఖోజ్ స్కూల్, పుణేలోని పీసీఎంసీ ఇంగ్లిష్ మీడియం స్కూల్.. సమాజంతో కలిసి పనిచేస్తున్న క్యాటగిరీలో చోటు దక్కించుకున్నాయి. హౌరాలోని సమరితాన్ మిషన్ స్కూల్.. ప్రతికూలతలను అధిగమించిన జాబితాలో ఎంపికైంది. ఐదు క్యాటగిరీల్లో అవార్డులను అందజేస్తున్నారు. రూ.2 కోట్ల ప్రైజ్ మనీని ఐదు క్యాటగిరీల్లోని అందరు విజేతలకు సమానంగా పంచుతారు.