Nepal | బుధవారం తెల్లవారుజామున పశ్చిమ నేపాల్‌లోని(Nepal )సుదూర్‌పశ్చిమ్ ప్రావిన్స్‌లో గల బజాంగ్ జిల్లాలోని కోట్‌దేవాల్ కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం(Earthquake) సంభవించింది. జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం (NEMRC) ప్రకారం ఉదయం 4:40 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్నాయి.
గత వారం పశ్చిమ నేపాల్‌లోని లుంబినీ ప్రావిన్స్‌లోని రుకుమ్ ఈస్ట్ జిల్లాలో 5 తీవ్రతతో ఒక మోస్తరు భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు.