రోమ్: ఇటలీలో ఓ టూరిస్టుపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ ఘటనలో స్థానిక పోలీసులు అక్రమ వలసదారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ అఘాయిత్యానికి చెందిన వివరాలు ఇలా ఉన్నాయి. కొలంబియాకు చెందిన 32 ఏళ్ల మహిళ.. ఇటలీ రాజధాని రోమ్కు టూరిస్టుగా వెళ్లింది. అయితే గత వారం ఓ రెస్టారెంట్లో ఒంటరిగా ఆమె డైనింగ్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆమెను అప్రోచ్ అయ్యాడు. మత్తుపదార్ధం కొనాలని భావిస్తున్నట్లు ఆ వ్యక్తితో ఆమె చెప్పింది. అయితే ఓ ప్లాన్ ప్రకారం ఆ వ్యక్తి ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ బలవంతంగా ఓ వ్యాన్లో ఆమెను ఎక్కించారు. ఆ తర్వాత వాడకంలో లేని ఓ బిల్డింగ్కు తీసుకెళ్లారు. అయితే ఆ బిల్డింగ్లో సుమారు 22 మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు ఇటలీ పోలీసులు పేర్కొన్నారు.
ఆమె ఫోన్, గుర్తింపు డాక్యుమెంట్లను దోచుకెళ్లినట్లు విచారణలో తేలిందని పోలీసులు గుర్తించారు. అయితే మూడు రోజుల పాటు .. ఆ మహిళను బలవంతంగా రేప్ చేశారు. ఆమెకు డ్రగ్స్ ఇచ్చి.. బెదిరించారు. కానీ ఓ అవకాశం చిక్కడంతో ఆ మహిళ వారి కనుకప్పి అక్కడ నుంచి పరారీ అయ్యింది. అర్థనగ్నంగా ఉన్న ఆమెను ఓ వ్యక్తి చూసి పోలీసులకు అలర్ట్ చేశాడు. ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె రక్తంలో నార్కోటిక్స్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి పోలీసులు ఆ బిల్డింగ్లో రెయిడ్ నిర్వహించారు.
కిడ్నాప్, డ్రగ్గింగ్, గ్యాంగ్ రేప్ ఆరోపణలపై ఆ సైట్ నుంచి అయిదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.ఆ బిల్డింగ్ వద్ద ఉన్న మరో 11 మంది వలసదారుల్ని డిపోర్టు చేశారు. అరెస్టు అయిన అయిదుగురు.. ఆఫ్రికా మూలాలు ఉన్న వ్యక్తులే. ఆఫ్రికా నుంచి మధ్యధర సముద్రం మార్గం ద్వారా ఇటలీలోకి అక్రమ వలసదారులు ప్రవేశిస్తున్నారు. ఏడాదికి సగటును 66 వేల మంది ప్రవేశిస్తున్నట్లు ఓ ఐక్యరాజ్యసమితి నివేదిక చెబుతోంది.
ఇటీవల వలసదారులు నేరాలతో ఇటలీ అట్టుడుకుతోంది. వాళ్ల నేరాలు ఆ దేశంలో ఓ రాజకీయ సమస్యగా మారాయి. లైంగిక హింస కేసులు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Una donna è rimasta rinchiusa per tre giorni in uno stabile abbandonato a Roma, dove, a più riprese, sarebbe stata costretta a subire violenze sessuali di gruppo dietro minacce di morte. Eseguiti 5 fermi a seguito delle indagini dei poliziotti della #squadra mobile#28maggio pic.twitter.com/W9KXiSNeO5
— Polizia di Stato (@poliziadistato) May 28, 2026