Philippine Ferry: ఫిలిప్పీన్స్ షిప్లో అగ్నిప్రమాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య
Philippine Ferry:205 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫిలిప్పీన్స్ పడవలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 31కి చేరుకున్నది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
మనీలా: దక్షిణ ఫిలిప్పీన్స్(Philippines)లో జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 31కి చేరుకున్నది. ఫెర్రీ(ferry)లో అగ్నిప్రమాదం జరగడం వల్ల భారీగా ప్రాణ నష్టం సంభవించింది. కాలిపోయిన ఓడ శిథిలాల్లో అనేక మంది మృతదేహాలను గుర్తించారు. మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు బాసిలన్ గవర్నర్ జిమ్ సల్లిమాన్ తెలిపారు.
సులు ప్రావిన్సు(Sulu province)లో ఉన్న మిండనావో దీవిలోని జాంబోంగా సిటీ నుంచి జోలో దీవికి వెళ్తున్న ద లేడీ మేరీ జాయ్ 3(Lady Mary Joy) ఫ్రెరీలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఆ సమయంలో ఆ పడవలో ఉన్న ప్రయాణికులు భయంతో సముద్రంలోకి జంప్ చేశారు.
ఫిలిప్పీన్స్ కోస్టు గార్డు(Philippines Coast Guard)తో సహా జాలర్లు ప్రయాణికుల్ని రక్షించారు. ఫెర్రీలో ఉన్న సుమారు 195 మంది ప్రయాణికుల్ని కాపాడారు. మరో 35 మంది సిబ్బంది కూడా ఉన్నారు. 14 మందికి గాయాలు కాగా, మరో ఏడు మంది ఆచూకీ లేకుండాపోయారు. షిప్ లిస్టులో 205 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

