బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Feb 06, 2020 , 12:31:26

మూడు ముక్కలైన విమానం : ముగ్గురు మృతి

మూడు ముక్కలైన విమానం : ముగ్గురు మృతి

ఇస్తాంబుల్‌ : టర్కీష్‌లోని ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం జరిగింది. బలమైన గాలులు, భారీ వర్షం కారణంగా విమానం రన్‌వేను ఢీకొనడంతో.. మూడు ముక్కలైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. 179 మంది గాయపడ్డారు. పెగాసస్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం ఇజ్మీర్‌ నుంచి ఇస్తాంబుల్‌లోని సబీహా గోక్సెన్‌ ఎయిర్‌పోర్టుకు బయల్దేరింది. గోక్సెన్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 177 మంది ప్రయాణికులు, ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నట్లు ఇస్తాంబుల్‌ అధికారులు తెలిపారు. ప్రయాణికుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఇస్తాంబుల్‌ గవర్నర్‌ అలీ యెర్లీకాయా తెలిపారు. మృతుల కుటుంబాలకు గవర్నర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.


logo
>>>>>>