మిలిటరీ క్యాంప్‌పై ఉగ్రవాద దాడి.. 27 మంది సైనికులు మృతి
Mali | మాలీలో మిలిటరీ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడిచేసి చేశారు. దీంతో 27 మంది జవాన్లు మరణించారు. 33 మంది తీవ్రంగా గాయపడగా, మరో ఏడుగురి ఆచూకీ లభించడంలేదని ప్రభుత్వం తెలిపింది. సెంట్రల్ మాలీలోని (Central Mali) గ్రామీణ ప్రాంతమైన
బమాకో: మాలీలో మిలిటరీ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడిచేసి చేశారు. దీంతో 27 మంది జవాన్లు మరణించారు. 33 మంది తీవ్రంగా గాయపడగా, మరో ఏడుగురి ఆచూకీ లభించడంలేదని ప్రభుత్వం తెలిపింది. సెంట్రల్ మాలీలోని (Central Mali) గ్రామీణ ప్రాంతమైన మోడోరోలో ఉన్న మిలిటరీ క్యాంపుపై కారు బాంబులతో దాడిచేశారని వెల్లడించింది. ప్రతిగా సైన్యం జరిపిన కాల్పుల్లో 70 మంది దాకా ఉగ్రవాదులు హతమయ్యారని పేర్కొన్నది. కాగా, ఇప్పటివరకు దాడికి బాధ్యతవహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు.
సెంట్రల్ మాలీలో అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలు క్రియాశీలకంగా కార్యకాలపాలు నిర్వహిస్తున్నాయి. 2012లో ఉత్తరాన ఉన్న ఎడారి ప్రాంతాన్ని అల్‌ఖైదాకు సంబంధించిన మిలిటెంట్లు తమ ఆధీనంలో కి తీసుకున్నారు. దీంతో ఫ్రాన్స్ సైన్యం రంగంలోకి దిగి వారిని అంతమొందించింది. మళ్లీ పుంజుకున్న ఉగ్రవాద సంస్థలు క్రమంగా తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. మాలి సరిహద్దుల్లో ఉన్న బుర్కినాఫాసో, నైగర్ దేశాలకు విస్తరించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Al qaeda
- France
- Islamic State
- Mali
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

