బొగ్గుగనిలో భారీ పేలుడు.. 25 మంది దుర్మరణం
Turkey | టర్కీలోని (Turkey) ఓ బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతిచెందగా, 110 మందికిపైగా గాయపడ్డారు. మరో 50 మంది గని చిక్కుకుపోయారు.
అంకారా: టర్కీలోని (Turkey) ఓ బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతిచెందగా, 110 మందికిపైగా గాయపడ్డారు. మరో 50 మంది గని చిక్కుకుపోయారు. బొగ్గగనిలో శుక్రవారం సాయంత్రం మీథేన్ వాయువు వల్ల పేలుడు సంభవించింది. దీంతో 25 మంది దుర్మరణం చెందారని అధికారులు వెల్లడించారు. 11 మంది క్షేమంగా బయటపడ్డారని వారిని దవాఖానకు తరలించామని చెప్పారు. సుమారు 50 మంది కార్మికులు గనిలో 300 నుంచి 350 మీటర్ల దూరంలో చిక్కుకుపోయారని తెలిపారు.
వారిని వీలైనంత తొందరగా రక్షిస్తామని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న సులేమాన్ సోయ్లు తెలిపారు. ఇప్పటికే చాలా మందిని బయటకు తీసుకొచ్చామన్నారు. గాయపడినవారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని టర్కీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహ్రెట్టీన్ కోకా ట్వీట్ చేశారు. టర్కీలోని సోమాలో 2014లో జరిగిన బొగ్గుగని ప్రమాదంలో 301 మంది కార్మికులు మరణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

