వాషింగ్టన్: ఈ ఫొటోలో ఉన్న జంటను చూశారా.. ఆమె పేరు క్రిస్టినా, ఆయన పేరు గాలిప్. ఆమె వయసు 24 ఏండ్లు. ఈ జంటకు 22 మంది పిల్లలు. పైగా పిల్లలందరికీ రెండేండ్ల కన్నా తక్కువ వయసే ఉంది. ఇదెలా సాధ్యపడిందా అని ఆశ్చర్యపోతున్నారా..? వారేమీ దత్తత తీసుకోలేదు. సరోగసీ ప్రక్రియ ద్వారా ఈ జంట ఈ పిల్లలకు జన్మనిచ్చింది. వీరందరినీ తానే స్వయంగా చూసుకుంటానని, అందరు తల్లుల్లాగనే తానూ వారికి అన్ని పనులు చేస్తానని క్రిస్టినా చెబుతున్నది. 100 మంది దాకా పిల్లలు కావాలనే కోరిక తనకు ఉండేదని పేర్కొన్నది.