లూసియానా: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ఉన్న లేక్ చార్లెస్లోని హెర్జ్ టవర్‌ను కూల్చేశారు(Skyscraper Imploded). 22 అంతస్థుల ఆ బిల్డింగ్ క్షణాల్లో నేలమట్టం అయ్యింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పేలుడు పదార్ధాలతో ఆ భవంతిని పేల్చేశాడు. కూలిన తర్వాత ఆ బిల్డింగ్‌కు చెందిన శిథిలాల దాదాపు అయిదు అంతస్తుల ఎత్తు వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొన్నేళ్ల క్రితం వచ్చిన లౌరా, డెల్టా హరికేన్ల ద్వారా ఆ బిల్డింగ్ ధ్వంసమైంది. క్యాపిటల్ వన్ టవర్గా ఫేమస్ అయిన ఆ బిల్డింగ్.. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా స్థానికులకు తెలుసు. 2020లో హరికేన్ల రాకతో లూసియానాలో భారీ నష్టం జరిగింది. అయితే ఈ బిల్డింగ్ కూడా ఆ నాటి హరికేన్ ధాటికి దెబ్బతిన్నది. కిటికీలు పగిలిపోయాయి. ఆ బిల్డింగ్‌ను రిపేర్ చేసేందుకు నిర్మాణ సంస్థ అంగీకరించినా.. కోర్టు కేసు ద్వారా పేల్చివేతకు రంగం సిద్ధం చేశారు.
లాస్ ఏంజిల్స్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ హెర్జ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూపు ఆ బిల్డింగ్ ఓనర్లు. 167 మిలియన్ల డాలర్లతో మళ్లీ ఆ బిల్డింగ్‌ను నిర్మించేందుకు రెఢీ అయ్యారు. బిల్డింగ్ పేల్చివేతకు సుమారు ఏడు మిలియన్ల డాలర్లు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాపర్టీ హెర్జ్ కంపెనీ వద్దే ఉన్నది. కానీ భవిష్యత్తుపై క్లారిటీ లేదు.
❗️💥🇺🇲 – A skyscraper in Louisiana, USA, was demolished after suffering significant damage from a hurricane in 2020.
The decision to demolish was made because it was more cost-effective than carrying out necessary repairs. pic.twitter.com/XCMjYQVTi6
— 🔥🗞The Informant (@theinformant_x) September 7, 2024