కీవ్: ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించినప్పటికీ రష్యా లెక్కచేయడం లేదు. గురువారం ఉక్రెయిన్‌పై దాడులను మరింత తీవ్రం చేసింది. ఖార్కివ్ వెలుపల ఉన్న నగరమైన మెరెఫాలో ఒక స్కూల్, సాంస్కృతిక కేంద్రంపై రష్యా సైనిక దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 21 మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. వీరిలో పది మంది పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తున్నది.
ఉక్రెయిన్‌లోని రెండో పెద్ద నగరమైన ఖార్కివ్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి రష్యా దళాలు వారం రోజులుగా తెగ ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాయు దాడులతో రష్యా విరుచుకుపడుతున్నది. దీంతో ఈ నగరంలోని చాలా భాగం బాగా ధ్వంసమైంది. మరోవైపు ఉక్రెయిన్‌పై దాడులను నిలిపివేయాలన్న అంతర్జాతీయ కోర్టు ఆదేశాలను రష్యా తిరస్కరించింది. అలాగే ఉక్రెయిన్‌తో జరుగుతున్న చర్చల్లో పురోగతిపై వస్తున్న వార్తలను కూడా రష్యా ఖండించింది.
కాగా, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ రష్యన్ సైనికులనుద్దేశించి ఒక వీడియోను విడుదల చేశారు. తెలివిలేని యుద్ధం కోసం రష్యా సైనికులు తమ జీవితాలను త్యాగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఆయన కోరారు. రష్యా ప్రజలంటే తనకు ఎంతో ప్రేమని అన్నారు. అందుకే వారికి వాస్తవం తెలియజేసేందుకు ఈ వీడియో సందేశాన్ని ఇస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.
I love the Russian people. That is why I have to tell you the truth. Please watch and share. pic.twitter.com/6gyVRhgpFV
— Arnold (@Schwarzenegger) March 17, 2022