బుధవారం 03 జూన్ 2020
International - Apr 11, 2020 , 12:32:02

మీ పౌరులను తీసుకెళ్లండి.. లేదంటే నిషేధమే

మీ పౌరులను తీసుకెళ్లండి.. లేదంటే నిషేధమే

కోవిడ్‌-19 వైరస్‌ విజృంభణతో తల్లడిల్లిపోతున్న అమెరికా, ఆ దేశంలోని ఇతర దేశ పౌరుల విషయంలో కఠినవైఖరి అనుసరిస్తున్నది. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో అమెరికాలో ఉన్న విదేశీ పౌరులను వెంటనే ఆయాదేశాలు తీసుకెళ్లాలని లేదంటే ఆయా దేశాలపై వీసా ఆంక్షలు విధిస్తామని అధ్యక్ష భవనం హెచ్చరించింది. ఈమేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖకు వైట్‌హౌస్‌ ఆదేశాలిచ్చింది.

తమ పౌరులు, జాతీయులను సొంత ప్రాంతాలకు తరలించటంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్న లేదా తీసుకెళ్లటానికి నిరాకరిస్తున్న దేశాలు ఉద్దేశపూర్వకంగానే అమెరికన్ల ఆరోగ్యానికి హాని తలపెడుతున్నాయని భావించాల్సి ఉంటుంది. అమెరికా చట్టాలను అతిక్రమించి ఇక్కడ ఉంటున్న విదేశీయులను కచ్చితంగా వారి దేశాలకు తీసుకెళ్లాల్సిందే అని ఆదేశాల్లో పేర్కొన్నారు.   


logo