వేల ఏళ్ల క్రితం మనిషి ఎలా ఉండేవాడు. వాళ్ల జీవన విధానం ఎలా ఉండేది? అనే విషయాలు తెలుసుకోవడం కోసం సైంటిస్టులు చాలా ఏళ్ల నుంచి రీసెర్చ్ చేస్తున్నారు. కానీ.. వాళ్ల స్థితిగతులు, వాళ్ల ఆచార వ్యవహారాల గురించి పుస్తకాల్లో చదవడం తప్పితే.. ఎలాంటి ఆధారాలు లేవు. అయితే.. తాజాగా వేల ఏళ్లు వెనక్కి వెళ్లేందుకు, గతాన్ని మళ్లీ తెలుసుకునేందుకు రీసెర్చర్లకు ఓ దారి దొరికింది. అదే.. 2000 ఏళ్ల నాటి మమ్మీకి చెందిన డీఎన్ఏ. అర్జెంటినాకు చెందిన మమ్మీల తలలో ఉండే పేను(headlice) పెట్టిన గుడ్ల నుంచి తీసిన డీఎన్ఏ ద్వారా గతంలోకి వెళ్లి అప్పటి విషయాలు తెలుసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా మనిషి తలలోని వెంట్రుకల్లో పేను ఉంటుంది. అది జీవితాంతం మనిషితోనే ఉంటుంది. అంటే.. మనిషి ఆరోజుల్లో ఎలా ఉన్నాడు.. ఏం చేసేవాడు.. వాళ్ల జీవిన విధానం ఏంటి అనేది.. ఈ సరికొత్త విధానం ద్వారా తెలుసుకోవచ్చు. మన పూర్వీకుల సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడు ఇదే కొత్త విధానం.. అని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌కు చెందిన సైంటిస్ట్ అలెజండ్రా పెరోట్టి తెలిపారు.
ఇంకా ఆమె ఏమన్నారంటే..మనిషి జన్యువుకు సంబంధించిన సమాచారం మొత్తం తలలో ఉండే పేను ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే.. వేల సంవత్సరాల క్రితం మనుషులు ఎలా జీవించేవారు, వాళ్లకు మరణాలు ఎలా సంభవించేవి.. అనే విషయాలను lice biology ద్వారా తెలుసుకోవచ్చు.. అని స్పష్టం చేశారు.
Ancient DNA extracted from nit 'cement' on hair of mummified people from nearly 2,000 years ago. New technique offers valuable new window into the past@ReadingBioSci @UNSJ_oficial @BangorUni @morethanadodo @uni_copenhagen https://t.co/JXidES22v7 pic.twitter.com/qVcCQDKJgB
— Reading Uni News (@UniRdg_News) December 29, 2021
ఈ డీఎన్ఏ ద్వారా అప్పటి మనుషులకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకునే పనిలో పడ్డారు సైంటిస్టులు. అప్పట్లో మనుషులకు సంభవించిన వ్యాధులు, ఇతర సమస్యలు.. అన్నింటినీ తెలుసుకునేందుకు ఈ డీఎన్ఏ ఎంతగానే ఉపయోగపడనుంది.