బాగ్దాగ్ : ఇరాక్‌లో రాజకీయ సంక్షోభం తప్పడం లేదు. అదే సమయంలో షియా మతాధికారి ముక్తాదా అల్-సదర్ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించగా.. దేశంలో హింస చెలరేగింది. ఆయన మద్దతుదారులు ప్రభుత్వ భవనాన్ని ముట్టడించారు. మరో వైపు రాజధానిలో భారీ ప్రదర్శనలు కొనసాగాయి. మరో వైపు అల్లర్లు చెలరేగగా.. బాగ్దాగ్ గ్రీన్జోన్లో 20 మంది ఆందోళనకారులపై సైన్యం జరిపిన కాల్పుల్లో 20 మంది మృతి చెందారు. దాదాపు వంద మందికిపై గాయాలైనట్లు తెలుస్తున్నది. షియా మతాధికారికి మద్దతుగా నిరసన నేపథ్యంలో ఇరాక్ సైన్యం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది. ఇరాక్‌లో కీలకమైన షియా మతాధికారి ముక్తాదా అల్ సదర్ సోమవారం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
అలాగే తన పార్టీ కార్యాలయాలను సైతం మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకలకు దిగారు. రిపబ్లికన్ ప్రభుత్వ భవనం వెలుపల ఆందోళనకారులు రచ్చ సృష్టించారు. ప్యాలెస్ గేట్లను పగులగొట్టారు. బాగ్దాద్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాకీ సైన్యం కర్ఫ్యూను ప్రకటించింది. షియా మతాధికారి మద్దతుదారులను రాజభవనానికి దూరంగా ఉండాలని, విధ్వంసాన్ని ఆపాలని సైన్యం కోరింది. అయితే, అల్ సదర్ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు ఇలానే చాలా సార్లు ప్రకటించారు. ఆయన చర్యలతో దేశంలో ఇప్పటికే అధ్వాన్నంగా ఉన్న పరిస్థితులు మరింత దిగజారే అవకాశాలున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.