Bus accident in Saudi Arabia | ఘోర ప్రమాదం.. వంతెనను ఢీ కొట్టిన యాత్రికుల బస్సు.. 20 మంది మృతి
Bus accident in Saudi Arabia | సౌదీ అరేబియా (Saudi Arabia)లో ఘోర బస్సు ప్రమాదం (Bus accident) చోటు చేసుకుంది. యాత్రికులతో హజ్ యాత్ర (hajj yatra)కు వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది.
Bus accident in Saudi Arabia | సౌదీ అరేబియా (Saudi Arabia)లో ఘోర బస్సు ప్రమాదం (Bus accident) చోటు చేసుకుంది. యాత్రికులతో హజ్ యాత్ర (hajj yatra)కు వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. సౌదీ వార్తాపత్రిక (Saudi state media) వెల్లడించిన వివరాల ప్రకారం..
సౌదీ అరేబియాలోని అసిర్ ప్రావిన్స్ (province of Asir) లోగల అకాబత్ షార్ రహదారిపై సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో యాత్రికుల బస్సు ఖమీస్ ముషైత్ నుంచి అభాకు వెళ్తోంది. ఆ సమయంలో బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తాపడింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 20 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 29 మంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్ , సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాచక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాగా, రంజాన్ మాసం తొలి వారంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. రంజాన్ మాసాన్ని అక్కడి ప్రజలు ఎంతో పవిత్ర మాసంగా భావిస్తుంటారు. ఈ మాసంలో అక్కడి ప్రజలు యాత్రలకు వెళ్తుంటారు. ముఖ్యంగా హజ్ యాత్రకు.
Also Read..
India Corona | కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. 11 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
Nikhat Zareen | బాక్సింగ్ ఐకాన్.. నిఖత్‌కు మహీంద్రా థార్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

