కరాచీ: పొరుగు దేశాల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్.. ఇప్పుడు అదే ముష్కరుల వరుస దాడులతో (Terror Attack) వణికిపోతున్నది. కరాచీలోని (Karachi) జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు జరిగింది. దీంతో ఇద్దరు చైనీయులతోపాటు పాకిస్థానీ మృతిచెందారు. మరో 10 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం రాత్రి 11 గంటల తర్వాత జరిగిందని, ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ ఆయిల్ ట్యాంకర్లో పేలుడు సంభవించిందని చైనీస్ ఎంబసీ ప్రకటించింది.
కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనంటూ బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. కరాచీ ఎయిర్‌పోర్టు నుంచి వస్తున్న చైనీస్ ఇంజినీర్లు, ఇన్వెస్టర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు తెలిపింది. ఇది ఉగ్రదాడేనని చైనీస్ ఎంబసీ నిర్ధారించింది. పోర్ట్ ఖాసిం ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (ప్రైవేట్) లిమిటెడ్ కంపెనీలో పనిచేసే చైనా సిబ్బందిని తీసుకెళ్తున్న కాన్వాయ్‌పై దాడి జరిగిందని తెలిపింది. పేలుడుకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది. పాక్‌లోని చైనా పౌరులు, కంపెనీలు, ప్రాజెక్టుల భద్రతపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఈ ఏడాది మార్చిలో పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు చైనీయులు సహా ఆరుగురు మరణించారు. ఇస్లామాబాద్ నుంచి కోహిస్థాన్ వెళ్తున్నపేలుడు పదార్థాలతో నిండిన వాహనం, షాంగ్లా జిల్లాలోని బిషామ్ ప్రాంతంలో ఓ బస్సును ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.
#WATCH | At least three foreign nationals died while 17 others sustained injuries in a huge explosion near Jinnah International Airport, Karachi, reports Pakistan’s Geo News.
(Video: Reuters) pic.twitter.com/qrJdStV9F7
— ANI (@ANI) October 7, 2024