న్యూయార్క్, జనవరి 10: అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకొన్నది. ఆదివారం న్యూయార్క్‌లోని ఓ భవనంలో జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది పిల్లలు సహా 19 మంది దుర్మరణం చెందారు. మరో 30 మంది దాకా గాయపడ్డారు. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు న్యూయార్క్ సిటీ అగ్ని మాపక విభాగం తెలిపింది.