న్యూఢిల్లీ: ఐఫోన్‌ను హ్యాక్ చేస్తే రూ.17.52 కోట్లు రివార్డు ఇస్తామని యాపిల్ సంస్థ ప్రకటించింది. కంపెనీ సెక్యూరిటీ బౌంటీ(బహుమతి) కార్యక్రమంలో భాగంగా తమ ఐఫోన్ సిస్టమ్స్‌ను బ్రేక్ చేసిన వారికి నగదు బహుమతులను అందిస్తామని ప్రకటించింది. భౌతికపరమైన యాక్సెస్ ద్వారా డివైస్ అటాక్ చేయగలిగితే రూ.1.31 కోట్లు, యూజర్ ఇంటరాక్షన్ ద్వారా నెట్వర్క్ అటాక్ చేస్తే రూ.2.18 కోట్లు అందిస్తారు.
యూజర్ ఇంటరాక్షన్ లేకుండా జీరో-క్లిక్ అటాక్ లాంటి నెట్వర్క్ అటాక్ చేస్తే రూ.8.76 కోట్లు పొందొచ్చు. ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్ ఎన్విరాన్‌మెంట్‌లోని రిక్వెస్ట్ డాటా మీద రిమోట్ అటాక్ చేస్తే ఇంతే మొత్తాన్ని అందుకోవచ్చు. లాక్డౌన్ మోడ్‌లో నిర్దిష్టమైన ప్రొటెక్షన్లను బైపాస్ చేసినవారు రూ.17.52 కోట్ల మొత్తాన్ని పొందవచ్చు.