సిరియాపై క్షిపణులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 15 మంది సాధారణ పౌరులు మృతి
సిరియా రాజధాని డమాస్కస్‌పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుపడింది. ఆదివారం ఉదయం డమాస్కస్‌లోని నివాస భావనాలపై క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో 15 మంది పౌరులు మరణించారు.
డమాస్కస్: సిరియా రాజధాని డమాస్కస్‌పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుపడింది. ఆదివారం ఉదయం డమాస్కస్‌లోని నివాస భావనాలపై క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో 15 మంది పౌరులు మరణించారు. పలువురు గాయపడ్డారు. నివాస ముదాయాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లు సిరియా అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున 12.30 గంటలకు భారీ శబ్దాలు వినిపించాయని స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. రెండు వారాల క్రితం ఇదే రీజియన్‌లో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ప్రకృతి ప్రకోపానికి భారీగా ప్రజలు మరణించగా, తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో మరికొంత మంది మృతిచెందారు.

కాగా, ఇటీవల కాలంలో సిరియాపై ఇజ్రాయెల్ వరుస దాడులకు పాల్పడుతున్నది. ఇరాన్ స్థావరాలకు కాపలాగా ఉన్న భద్రతా బలగాలపై క్షిపణుల వర్షం కురిపించారని, అయితే అవి నివాస సముదాయాలపై పడ్డాయని అధికారులు తెలిపారు. దీంతో సాధారణ పౌరులు మరణించారన్నారు. గతేడాది 2022, ఆగస్టులో సిరియా మిలిటరీ ఆయుధ డిపోపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు జరిపింది. దీంతో ఒక ఆర్మీ కెప్టెన్ మృతిచెందాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Damascus
- Earthquake
- iran
- Israel
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

