వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు (Mass Shooting) కలకలం సృష్టించాయి. సౌత్ కరోలినా బీచ్ టౌన్‌లోని లిటిల్ రివర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో 11 మంది గాయపడటంతో హారీ కౌంటీ పోలీసులు వారిని దవాఖానకు తరలించారు. అయితే కాల్పుల్లో ఎంతమంది గాయపడ్డారో అధికారులు స్పష్టతనివ్వలేదు. కాల్పులు ఎవరు జరిపారు, కారణం ఏటనే విషయాలు తెలియాల్సి ఉన్నది.
ఈ నెల 22న వాషింగ్టన్ డీసీలోని ఇజ్రాయెల్ ఎంబసీపై ఓ వ్యక్తి కాల్పులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఎంబసీలో పనిచేస్తున్న సిబ్బందిని కాల్చి చంపాడు. యూదుల మ్యూజియం వెలుపల జరిగిన ఈ ఘటన జరిగింది. చికాగోకు చెందిన ఎలియాస్ రోడ్రిగ్జ్ అనే వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం పాలస్తీనా అనుకూల నినాదాలు చేశాడు.