బండ్లగూడ, మార్చి 14 : వైన్స్ షాపులో చోరీకి వచ్చిన దొంగ.. పట్టుకోబోయిన వాచ్‌మన్‌ను హత్య చేశాడు. ఈ సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. శుక్రవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. షాబాద్‌కు చెందిన భిక్షపతి స్థానిక దుర్గా వైన్స్‌లో రాత్రి వేళలో వాచ్‌మ న్గా పనిచేస్తున్నాడు. కాగా.. పుడుగుర్తి సీతారాంపూర్ గ్రామానికి చెందిన తుమ్మలపల్లి నరేందర్ ఈనెల 12న రాత్రి దుర్గా వైన్స్ లో దొంగతనానికి వచ్చాడు. గోడను కూల్చి లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా డు.
చప్పుడుకు నిద్రలేచిన వాచ్‌మన్ దొంగ దొంగ అంటూ అరిచాడు. దీంతో నరేందర్ అతని తలపై గట్టిగా మోదగా.. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెం దాడు. అనంతరం నరేందర్ వైన్స్‌లోకి చొరబడి రూ.40 వేల నగదు, మందు సీసాలను తీసుకొని పారిపోయాడు. వైన్స్ యజమాని ఉదయం వచ్చి చూసేసరికి భిక్షపతి మృతి చెంది ఉండడం గమనించి,, వైన్స్ లోకి వెళ్లి పరిశీలించగా దొంగతనం జరిగినట్టు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు.
క్లూస్ టీం సహకారంతో పోలీసులు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే నిందితుడు నరేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం ఒప్పుకున్నాడు. అతని నుంచి రూ.29 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే బహదూర్‌పురా, అత్తాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయి ఉన్నట్లు తెలిపారు. ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, ఏ ఏసీపీలు శశాంక్ రెడ్డి, కృష్ణ, సీఐ ప్రశాంత్కృలను ఈ సందర్భంగా డీసీపీ అభినందించారు.