Commits suicide | పెళ్లి చేసుకోవాలని కోరుతూ వీడియో కాల్.. యువతి ఆత్మహత్య
ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని కోరుతూ వీడియో కాల్ చేసి, అనంతరం ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది
కొండాపూర్, అక్టోబర్ 25 : ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని కోరుతూ వీడియో కాల్ చేసి, అనంతరం ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్చనా చౌదరి మాలిక్, చంద్రనాయక్ తండాలోని ఎస్ఆర్ సద్గురు రెసిడెన్సీలో నివాసం ఉంటోంది. ఉత్తరాఖండ్‌కు చెందిన భండారి విమల్‌తో ఆమెకు గత నాలుగేళ్లుగా పరిచయం ఉండగా, ఇద్దరూ సహోద్యోగులుగా పనిచేస్తున్నారు. విమల్ శనివారం రాత్రి తల్లితో కలిసి చేర్యాలలో ఓ కార్యక్రమానికి వెళ్లాడు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అర్చనా అతడికి వీడియో కాల్ చేసి, ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీ కట్టి చూపిస్తూ పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.
అనంతరం ఆమె ఫోన్ ఎత్తకపోవడంతో ఆందోళనకు గురైన విమల్ ఉదయం 5.30 గంటల సమయంలో ఆమె ఉంటున్న ఫ్లాట్‌కు చేరుకున్నాడు. తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో డయల్ 112కు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పెట్రోలింగ్ సిబ్బంది తలుపులు బలవంతంగా తెరిచి చూడగా అర్చనా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ దవాఖా తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా విమల్‌కు ఇది వరకే పెళ్లి అవ్వగా విడాకులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ వివాదంపై స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!
Atrial Fibrillation | ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
BRS | కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భార్గవ్ దేశ్‌పాండే
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
AP News | కృష్ణానదిలో మునిగిన నాటుపడవ.. ఇద్దరు యువకులు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

