సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ): జాతీయ స్టార్టప్ డే(National Startup Day)ను పురస్కరించుకొని టీ హబ్(T Hub)లో ఆవిష్కరణలపై స్టార్టప్ వ్యవస్థాపకులతో ప్రత్యేకంగా వర్క్‌షాపు(Workshop) నిర్వహిస్తున్నామని టీ హబ్ నిర్వాహకులు తెలిపారు. స్టార్టప్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని 2021లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 16వ తేదీని నేషనల్ స్టార్టప్ డేగా ప్రకటించారు.
ఈనేపథ్యంలో టీహబ్‌లో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు విజయవంతంగా స్టార్టప్‌లను నిర్వహిస్తున్న వ్యవస్థాపకులు, ఆ రంగానికి చెందిన నిపుణులతో ప్రత్యేకంగా ఒక రోజు వర్క్‌షాపును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ కింది లింకు (https://bit.ly/3tLGUFL )లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని టీహబ్ నిర్వాహకులు సూచించారు.