సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరానికి కీలకమైన మెట్రో ఫేజ్-2 విస్తరణ ప్రాజెక్టుపై తెలంగాణ ఎంపీలతో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చర్చించారు. శనివారం పార్క్‌హయత్ హోటల్లో జరిగిన సమావేశంలో ఫేజ్-2 ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వారికి వెల్లడించారు.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, అంతర్జాతీయ స్థాయి రవాణా వసతులను ఏర్పాటు చేయడంలో ఫేజ్-2 ప్రాజెక్టు కీలకమని ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు.. మల్లు రవి, కిరణ్‌కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, రఘురామరెడ్డి, బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, సురేష్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు.