జవహర్‌నగర్, మే 22: బిట్స్ పిలానీ క్యాంపస్‌లో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఎంటెక్, ఎంబీఏ, ఎమ్మెస్సీ, బీటెక్‌లో చేరేందుకు అడ్మిషన్స్ ప్రారంభమైనట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆధునిక వ్యాపారాలు, ఉత్పత్తులు, డిజిటల్ సాంకేతికతలను అందిపుచ్చుకునేందుకు వర్క్ ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఈ నెల 22 నుంచి జూన్ 17 వరకు అడ్మిషన్లు ఉంటాయని, ఆసక్తిగల ప్రొఫెషనల్స్ క్యాంపస్‌లో సంప్రదించాలని సూచించారు.