హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. గత కొంతకాలంగా
ప్రేమ పేరుతో ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడని బలవన్మరణానికి పాల్పడింది. జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నది. లైంగికంగా వాడుకుని వేధింపులకు గురిచేస్తున్నాడని, టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్లో పేర్కొన్నది. దీంతో యువతి తండ్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.