TSRTC | హైదరాబాద్‌లో ఫ్రీ బస్సు లొల్లి.. ఆర్టీసీ డ్రైవర్‌పై మహిళ ఆగ్రహం.. వీడియో
TSRTC | రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం ఎక్కడో ఒక చోట ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సీట్ల కోసమో, బస్సును ఆపడం లేదనో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోని లక్డీకాపూల్ బస్టాండ్‌లో గొడవ చోటు చేసుకుంది.
TSRTC | హైదరాబాద్ : రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం ఎక్కడో ఒక చోట ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సీట్ల కోసమో, బస్సును ఆపడం లేదనో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోని లక్డీకాపూల్ బస్టాండ్‌లో గొడవ చోటు చేసుకుంది.
లక్డికాపూల్లో బస్టాండ్‌లో బస్సు ఎక్కేందుకు సిద్ధమైన ఓ మహిళను ఆర్టీసీ డ్రైవర్ నిలువరించాడు. బస్సు ఓవర్ లోడ్ అయిందని చెప్పి ఆమెను బస్సు ఎక్కించుకునేందుకు నిరాకరించాడు. తనను ఎందుకు ఎక్కించుకోరు అంటూ ఆర్టీసీ డ్రైవర్‌పై బాధిత మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను బస్సు నడపలేను.. బండి తీసుకొని పో అంటూ ఆమె పట్ల డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. బస్సు ఎక్కించుకుంటావా..? లేదా..? అంటూ ఆమె బస్సుకు ఎదురుగా వెళ్లి నిల్చుంది. ఆ తర్వాత ఆమెను ఎక్కించుకోవడంతో బస్సు ముందుకు కదిలింది. ఈ ఘర్షణ నేపథ్యంలో ఫ్రీ బస్సు ఎవరు పెట్టమన్నారంటూ మహిళలు మండిపడ్డారు. ఉచిత బస్ పెట్టి మా ప్రాణాల మీదకు తెస్తున్నారని డ్రైవర్ కూడా అసహనం వ్యక్తం చేశాడు.
హైదరాబాద్‌లో ఫ్రీ బస్సు లొల్లి
లక్డికాపూల్లో బస్సు ఓవర్ లోడ్ అయిందని మహిళను బస్సు ఎక్కించుకునేందుకు నిరాకరించిన సిటీ ఆర్టీసీ బస్ డ్రైవర్
నన్ను ఎలా ఎక్కించుకోరు అంటూ ఆర్టీసీ డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ.
నేను బస్సు నడపలేను.. బండి తీసుకొని పో అంటూ మహిళపై ఆర్టీసీ డ్రైవర్… pic.twitter.com/p47hC7s39K
— Telugu Scribe (@TeluguScribe) May 9, 2024
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

