సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న మహిళను ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేసి, ఆమె వద్ద నుంచి 2.06గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్ ఎస్ఐ బాలరాజు కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ మండలం సీఎన్ఎన్ తండాకు చెందిన ఫర్జానా బంజారాహిల్స్‌లోని మధు వద్ద డ్రగ్స్‌ను కొనుగోలు చేసి, సీఎన్ఎన్ తండాలో విక్రయిస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు గురువారం తండాలోని ఫర్జానా నివాసంపై దాడులు చేసి నిందితురాలిని అరెస్టు చేసి, డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నగరంలోని మలక్‌పేటలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.2.5లక్షల విలువ చేసే 1.3కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ జానీమియా, షేక్ నజీర్, రంగారెడ్డి జిల్లాకు చెందిన పెద్ద గొల్ల శ్రీకాంత్ మలక్‌పేటలో గంజాయి వ్యాపారం చేస్తున్నారు. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. కేసును మలక్‌పేట ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.