మైలార్‌దేవ్‌పల్లి, డిసెంబర్ 24: మధుబన్ కాలనీలో కిడ్నాప్‌నకు గురైన బాలుడు సరక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. మైలార్‌దేవ్‌పల్లి సీఐ మధు ఆధ్వర్యంలో 5 టీమ్‌లను రంగంలోకి దింపి గంటల వ్యవధిలోనే బాలుడిని సురక్షితంగా కాపాడారు. శనివారం ఉదయం 5 గంటలకు బంజారాహిల్స్ నుంచి బాలుడిని తీసుకువచ్చి మధుబన్ కాలనీలోని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే కిడ్నాప్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.