సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): నగరంలో హాష్ ఆయిల్ విక్రయించేందుకే ప్రయత్నిస్తున్న ఓ పాత నేరస్తుడిని సౌత్‌వెస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 825 గ్రాముల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుదీంద్ర కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకు చెందిన నవీన్ స్థానికంగా మత్తుపదార్థాలు విక్రయిస్తూ అక్కడి ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడి.. నిమాజాబాద్ జైలుకు వెళ్లాడు. ఆ జైలులో హాష్ ఆయిల్ విక్రయిస్తూ పట్టుబడిన అరక్కు చెందిన యేసయ్య కూడా ఉన్నాడు. ఈ క్రమంలో నవీన్, యేసయ్య మధ్య పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చిన నవీన్ నేరుగా యేసయ్య ఉండే అరక్, లంబసింగి ప్రాంతానికి వెళ్లి, అక్కడ రూ. 50 వేలకు 825 గ్రాముల హాష్ ఆయిల్‌ను కొనుగోలు చేసి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. సికింద్రాబాద్ జేబీఎస్ ప్రాంతంలో హాష్ ఆయిల్‌ను విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా.. విశ్వసనీయ సమాచారం మేరకు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బాలస్వామి ఆధ్వర్యంలోని బృందం నిందితుడిని అరెస్టు చేసింది.