మన్సురాబాద్, మార్చి 30: హైదరాబాద్‌లోని మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్‌లో మార్నింగ్ వాకర్స్‌కు పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వాకర్స్ కోసం పార్కులో ఓపెన్ జిమ్, వాటర్ ప్యూరిఫైడ్ ప్లాంటు, యోగా చేసుకునేందుకు షెడ్డును నిర్మింపజేయాలని వాకర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేలు కోరారు.
మార్నింగ్ వాకర్స్ విజ్ఞప్తిపై ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆటోనగర్ ప్రాంతంలోని హరిణ వనస్థలి నేషనల్ పార్క్‌లో ప్రతిరోజు సుమారు 500 మంది వాకర్స్ వస్తున్నారని తెలిపారు. రెండు మూడు రోజుల్లో మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ ను సందర్శిస్తారని పేర్కొన్నారు. వాకర్స్ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జగదీశ్ యాదవ్, కార్యదర్శి వెంకట్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, యోగా సాధన అధ్యక్షులు లింగారెడ్డి, గుప్త లక్ష్మారెడ్డి, సునీల్ రెడ్డి, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.