వాటర్ టెన్షన్… అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీల్లో పెరిగిన నీటి ఖర్చులు
అపార్ట్మెంట్ల,గేటెడ్ కమ్యూనిటీల్లో అదనపు నీటి అవసరాల భారం భారీగా పెరుగుతున్నది. అపార్ట్మెంట్ల, గెటేడ్ కమ్యూనిటీలలో కుటుంబానికి రూ.4 వేల నుంచి రూ. 5 వేల భారం పడుతున్నది.
- కుటుంబానికి రూ. 4 వేల నుంచి రూ.5 వేల వరకు
అపార్ట్మెంట్ల,గేటెడ్ కమ్యూనిటీల్లో అదనపు నీటి అవసరాల భారం భారీగా పెరుగుతున్నది. అపార్ట్మెంట్ల, గెటేడ్ కమ్యూనిటీలలో కుటుంబానికి రూ.4 వేల నుంచి రూ. 5 వేల భారం పడుతున్నది. మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాలలో ఉన్న అపార్ట్మెంట్ల, గెటేడ్ కమ్యూనిటీల్లో ఈ పరిస్థితి నెలకొంది. అక్టోబర్ నెలలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మరో 10 నెలల వరకు నీటి ఎద్దడి ఇలాగే కొనసాగితే.. ఊహకే అందని విధంగా ఇబ్బందులు ఉంటాయన్న ఆందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. జలమండలి, మున్సిపల్ సర్కిళ్లు చేస్తున్న నీటి సరఫరాలోలో ప్రెజర్ మూలంగా అపార్ట్మెంట్ల, గేటెడ్ కమ్యూనిటీల్లో నివసిస్తున్న కుటుంబాలకు నీటి అవసరాలు తీరడం లేదు. దీంతో తప్పనిసరిగా వాటర్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రతి కుటుంబానికి ఇప్పుడే రూ.4 వేల నుంచి 5 వేల వరకు పడుతున్న భారం మరిన్ని రోజుల్లో మరింతంగా పెరిగే అవకాశం ఉంటుందన్న ఆందోళన ఉంది. ప్రజల నీటి అవసరాల అదను చూసి డిమాండ్ మేరకు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు ఇష్టానుసారంగా వాటర్ ట్యాంకర్ల ధరలను పెంచి ప్రజలను పిప్పి చేస్తున్నారు. 5 వేల లీటర్ల వాటర్ ట్యాంకర్‌కు ప్రైవేట్ ట్యాంకర్లు ఇప్పుడే రూ. 900 నుంచి రూ. 1200 వరకు విక్రయిస్తున్నారు.
– మేడ్చల్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ)
మేడ్చల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని డివిజన్లలో ప్రతి రోజూ 800 నుంచి 1200 ట్యాంకర్లకు బుకింగ్‌లు జరుగుతున్నాయి. బుకింగ్‌లో 70 శాతానికి మించి నీటి సరఫరా జలమండలి చేయడం లేదని బుకింగ్‌లు చేసుకున్న ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో బుకింగ్ చేసిన వారం రోజులు దాటినా.. నీటి సరఫరా చేయకుండా జలమండలి అధికారులు చేతులెత్తేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో గతంలో మిషన్ భగీరథ ద్వారా మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజవవర్గాలలోని 112 అవాస ప్రాంతాలకు నీటి సరఫరా చేసేవారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే ఈ ప్రాంతాలను ఎంఎంసీ, సీఎంసీలలో విలీనం చేసింది. విలీనం చేసిన నూతన సర్కిళ్లు బోడుప్పల్, కీసర, ఘట్కేసర్, మేడ్చల్‌లలో నీటి సరఫరాను జలమండలికి ప్రభుత్వం అప్పగించినా.. ఇప్పటి వరకు ఈ కొత్త సర్కిళ్లను జలమండలి విలీనం చేసుకోకపోవడంతో నీటి సరఫరా విషయమై అయోమయానికి గురవుతున్నది. మిషన్ భగీరథ ద్వారా 4 నుంచి 5 రోజులకు నీటి సరఫరా జరుగుతున్న క్రమంలో జలమండలి ఈ సర్కిళ్లను విలీనం చేసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అయితే వివిధ కాలనీల్లో నివాసముండే వారు అవసరాలకు నీటిని కొనుగోలు చేయలేని పరిస్థితి.
6.30 మీటర్లకు పడిపోయిన భూగర్భ జలాలు
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 6.30 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. గత సెప్టెంబర్ నెల వరకు 6.30 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోయి ఉండగా.. అక్టోబర్ నెలకు సంబంధించి మరిన్ని మీటర్ల తోతుకు పడిపోయే అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఇంత జరుగుతు న్నా.. జిల్లా అధికారులు నీటి ఎద్దడి నివారణకు మాత్రం ముందస్తు చర్య లు తీసుకోకపోవడంపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితి అంచనా వేసి నీటి ఎద్దడి నివారణకు తీసుకునే చర్యలను అధికారులు చేపట్టాలని డిమాండ్లు వస్తున్నాయి.

01
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

