Jubilee Hills Results | జూబ్లీహిల్స్‌లో కొనసాగుతున్న కౌంటింగ్.. గెలుపుపై ధీమా వ్యక్తంచేసిన మాగంటి సునీత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు (Jubilee Hills Results) ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 101 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. అనంతరం షేక్‌పేట డివిజన్ ఓట్లను లెక్కించనున్నారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు (Jubilee Hills Results) ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 101 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. అనంతరం షేక్‌పేట డివిజన్ ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపునకు మొత్తం 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 10 రౌండ్లలో ఫలితం తేలనుంది. ఒక్కో రౌండ్‌కు 40 నిమిషాలు పట్టనుంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది ఫలితం వెలువడనుంది. అయితే 10 గంటల వరకు ఫలితంపై ఒక స్పష్టత రానుంది.
ఈ నెల 11న జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 48.49 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 1,94,631 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 99,771 మంది పురుషులు, 94,855 మంది మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. బోరబండ్ డివిజన్లో 29,760 మంది ఓట్లు వేయగా, రహమత్‌నగర్ డివిజన్లో 40,610 ఓట్లు పోలయ్యాయి. ఇక ఎర్రగడ్డ డివిజన్లో 29,112 ఓట్లు, వెంగళరావ్‌నగర్‌లో 25,195 ఓట్లు, షేక్‌పేట డివిజన్లో 31,182 ఓట్లు, యూసఫ్‌గూడలో 24,219 ఓట్లు, సోమాజిగూడలో 14,553 ఓట్లు పోలయ్యాయి.
కాగా, గెలుపుపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ధీమా వ్యక్తం చేశారు. మంచి మెజార్టీతో విజయం సాధిస్తామని తెలిపారు. న్యాయం గెలుస్తుందని చెప్పారు.
ఏ రౌండ్లో.. ఏ డివిజన్ ఓట్లు లెక్కిస్తారంటే..

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: కర్వా చౌత్ రోజున ప్రియుడిని కలిసిన భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
Congress Party | కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలతో సతమతమయ్యాం..కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి : ఐనేని దీపక్ రావు
New Plant | అరుణాచల్‌లో రెండు కొత్త మొక్కల గుర్తింపు
విద్యుత్ షాక్‌తో పాడి బర్రె మృతి
కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

