వికారాబాద్, జూలై 5 : విహార యాత్రకు వచ్చి బోట్ బోల్తా పడడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో శనివారం చోటు చేసుకున్నది. బాధితులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్‌పల్లి ప్రాజెక్టు సమీపంలో వెల్డర్న్నెస్ అనే ఒక రిసార్ట్ ఉంది. బిహార్ రాష్ర్టానికి చెందిన కొంత మంది, హైదరాబాద్‌కు చెందిన మరికొంత మంది పర్యాటకులు కలిసి దాదాపు 10 మంది శనివారం వికారాబాద్‌లోని వెల్డర్‌నెస్ రిసార్ట్‌కు వచ్చారు. రిసార్ట్ వెనుకాల సర్పన్‌పల్లి చెరువు ఉండటంతో అందులో అనుమతులు లేకుండా నిర్వాహకులు బోటింగ్ నిర్వహించారు. నిర్వాహకుల సహాయంతో పర్యాటకులు బోటింగ్ చేస్తున్నారు.
ఒక బోటింగ్‌లో రీటా కుమారి (55), పూనం సింగ్(56) ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఆ బోట్ కాసేపటికే ప్ర మాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. గమనించిన స్థానికులు చిన్నారులను కాపాడారు. మహిళలను కాపాడే ప్రయత్నం చేశా రు ..కాని వారు అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంట నే చికిత్స నిమిత్తం వారిని దవాఖానకు తరలించగా ఫలితం లేక పోయింది. విహారానికి వచ్చిన వారికి విషాదం మిగిలిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృత దేహాలను ప్రభుత్వ దవాఖానలో పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో భద్రపరిచారు.