Vegan Walk | శనివారం సంజీవయ్య పార్క్ వద్ద విజ్ఞాన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జంతువులను కాపాడాలని.. వాటి ద్వారా వచ్చే పాలు.. మాంసము..గుడ్లు వాడకూడదని.. జంతువులను స్వేచ్ఛగా జీవించనీయాలంటూ.. జంతు ప్రేమికులు వాక్ ద్వారా అవగాహన కల్పించారు.
మాదాపూర్ హైటెక్స్ గ్రౌండ్లో శనివారం ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ 14 ఎన్జీఓలతో కలిసి ‘హైదరాబాద్ 5కే రన్’ 13వ ఎడిషన్‌ను నిర్వహించింది. ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ రన్‌ను ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2024 రేస్ డైరెక్టర్ రాజేశ్ వెచ్చా, ఈడీ జైపాల్‌రెడ్డి, ఐబీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ హెడ్ బ్రాంచ్ బ్యాంకింగ్ సౌత్ నిరీశ్ లలాన్ జెండా ఊపి ప్రారంభించారు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి సమతుల్యమైన ఆహారంతో పాటు వ్యాయామం, యోగా వంటివి దినచర్యలో భాగం కావాలని పిలుపునిచ్చారు.