‘పెరుగు తాగిన పిల్లి’ఘటనపై విచారణ
జేఎన్టీయూహెచ్ వర్సిటీలోని మంజీరా హాస్టల్లో ఆహార పదార్థాల గిన్నెపై కూర్చున్న పిల్లి ... దర్జాగా పెరుగు తాగిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించడం...
- ‘నమస్తే’ కథనంపై స్పందించిన వర్సిటీ అధికారులు
- ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దంటూ..ఆదేశం
కేపీహెచ్‌బీకాలనీ, జూలై 17 : జేఎన్టీయూహెచ్ వర్సిటీలోని మంజీరా హాస్టల్లో ఆహార పదార్థాల గిన్నెపై కూర్చున్న పిల్లి … దర్జాగా పెరుగు తాగిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించడం… ‘నమస్తే’లో ఆ వార్తను ప్రచురించడంతో వర్సిటీ అధికారులు స్పందించి.. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. బుధవారం వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి హాస్టల్లో జరిగిన సంఘటనపై విచారణకు ఆదేశించారు.
వర్సిటీలోని హాస్టల్లోని వంటగదులను పరిశీలించాలని, పిల్లి, ఎలుక, బొద్దింకలు, బల్లులు, ఇతర జీవాలు వంటగదిలోకి రాకుండా చేయాలని, విద్యార్థులకు అందించే ఆహారం… శుచి, శుభ్రతగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకోవాలని హాస్టల్ వార్డెన్లు, సిబ్బందిని ఆదేశించారు.
కాగా, సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ‘పెరుగు తాగిన పిల్లి’..అంశంపై మాట్లాడుతూ… వర్సిటీ హాస్టల్లో ఓ కిటికీ తెరిచి ఉండటం వల్ల పిల్లి హాస్టల్ గదిలోకి వచ్చిందన్నారు. విద్యార్థులు భోజనం చేసిన తర్వాతే..రాత్రి వేళలో పిల్లి లోపలికి వచ్చిందని, విద్యార్థులకు భోజనాలను వడ్డించే సమయంలో వచ్చే అవకాశం లేదన్నారు. విద్యార్థులకు అందించిన భోజనం శుభ్రమైనదేనని, పిల్లి ముట్టలేదని స్పష్టం చేశారు. హాస్టల్లో పర్యటించిన జీహెచ్ఎంసీ ఫుడ్‌సేఫ్టీ అధికారులు.. ఈ అంశాన్ని ధ్రువీకరించినట్లు తెలిపారు.
హాస్టల్లోని కొందరు విద్యార్థులు కావాలనే…వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, దురుద్దేశంతోనే ఈ అంశాన్ని ప్రచారం చేయించారని తెలుస్తుందన్నారు. హాస్టల్లో సమస్యలను గుర్తిస్తే… వర్సిటీ మెస్ సిబ్బంది…లేదా వార్డెన్‌కు ..లేదా కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయకుండా సోషల్ మీడియాలో పెట్టడం సరికాదన్నారు. ఈ అంశంపై పూర్తి విచారణ చేసిన తర్వాత బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

