ఉప్పల్/రామంతాపూర్, ఫిబ్రవరి 3: నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని లక్ష్మిఫ్రైడ్ కాలనీలో ఎమ్మెల్యే పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని కాలనీల్లో, బస్తీల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాజీపడే ప్రసక్తే లేదని, అభివృద్ధి, ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రథమ కర్తవ్యం అని అన్నారు. లక్ష్మిఫ్రైడ్ కాలనీలో తాగునీటి సమస్యలను పరిష్కరించడంతో పాటు డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, అదేవిధంగా కాలనీలో నెలకొన్న విద్యుత్, పారిశుధ్య సమస్యలను అధిగమించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ధన్‌పాల్‌రెడ్డి, సీసీఎస్ ప్రతినిధి పద్మారెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు శ్రావణ్‌కుమార్‌రెడ్డి, గోవర్దన్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, రాంచందర్, సుధాకర్‌రెడ్డి, గంప కృష్ణ, సారా వినోద్, మల్లారెడ్డి, శ్యామ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
దళితుల సాధికారత కోసమే దళితబంధు
దళితుల కుటుంబాల సాధికారత కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళితబంధు’ ప్రవేశపెట్టారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ‘దళితబంధు’ పథకం కింద హబ్సిగూడకు చెందిన చెంచాల శ్రీనివాస్‌కు మంజూరైన ‘ఎదత్త ఎంటర్ర్పైజెస్ బ్యాటరీ’ యూనిట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ‘దళితబంధు’ దళితులకు జీవనోపాధి చూపటమేగాక రాష్ట్రం అభివృద్ధికి బాటలు వేస్తున్నది. దళితులకే కాకుండా ఇతరులకు కూడా ఉపాధి చూపుతున్నది. అలాగే ఎందరో దళితులు పథకం ద్వారా ఆర్థికంగా ఎదుగుతూ స్థానికంగా వందల మందికి ఉపాధి చూపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికి నాయకులు పాల్గొన్నారు.