చర్లపల్లి, డిసెంబర్ 24 : అన్ని వర్గాల సంక్షేమానికి తన వంతు కృషి చేయనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం చర్లపల్లి డివిజన్, కుషాయిగూడ ముదిరాజ్ సంక్షేమ సంఘం రూపొందించిన నూతన సంవత్స ర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్‌ల సంక్షేమానికి కృషి చేస్తామని, ముఖ్యంగా గత ఎన్నికల్లో సంక్షేమ సంఘం నాయకులు మద్దతు ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.
ముదిరాజ్ సంక్షేమ సంఘానికి కమ్యూనిటీహాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు భవన నిర్మాణానికి కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ముదిరాజ్ సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పిట్టల నాగరాజు, గడ్డల పాండు, సభ్యులు బండి నర్సింగ్‌రావు, అమర్నాథ్, శ్యామ్‌రావు, జక్కుల ప్రేమ్, కొల్కూరి శ్రీకాంత్, చాగం టి రవి, జక్కుల కావ్య, కొలిపాక కనకయ్య, రెడ్డబోయిన రాజు, సారా ప్రశాంత్, పిట్టల భరత్, కూర యాదగిరి, చింతల శేఖర్, సలోని, వెంకటేశ్, సాయికిరణ్, రమేశ్ పాల్గొన్నారు.