Nacharam | ఉప్పల్, మార్చి 4 : పనులు సత్వరం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. నాచారం బాబానగర్ రోడ్డులో అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న నాచారం పెద్ద నాలాపై రూ. 94 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను కార్పోరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్, అధికారులతో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పర్యవేక్షించడం జరిగింది.
ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులు నాలాకి అడ్డుగా ఉన్న మంచినీటి పైపు తొలగించాల్సిందిగా జలమండలి వారికి తెలియచేసిన కూడా రావడం లేదని చెప్పడంతో అప్పటికప్పుడు జలమండలి జీఎంతో మాట్లాడి తక్షణమే అడ్డుగా ఉన్న మంచినీటి పైపులైన్ తొలగించాలని ఎమ్మెల్యే సూచించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వంతెన నిర్మాణం నాణ్యతతో నిర్మించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఈ నాగేందర్, డిఈ బాలకృష్ణ, ఏఈ కీర్తి, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, జలమండలి మేనేజర్ సిరాజ్, బీఆర్ఎస్ నాయకులు సాయి జెన్ శేఖర్, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, కార్యకర్తలు పాల్గొన్నారు.