MMTS | కాచిగూడ, జూన్ 27 : ఎంఎంటీఎస్ రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ వివరాల ప్రకారం.. గుర్తుతెలియని యువకుడు(30)గురువారం అర్ధరాత్రి కాచిగూడ-మలక్ పేట రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా అదే సమయంలో ఎదురుగా వచ్చిన ఎంఎంటిఎస్ రైలు ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవఖానకు తరలించారు. ఒంటిపై లేత నీలిరంగు జీన్స్ పాయింట్, నీలిరంగు చొక్కా ధరించి, ఎత్తు 5.5 ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల కోసం 9573948545 లో సంప్రదించాలని హెచ్ సి రవికుమార్ కోరారు.