కాచిగూడ : గుర్తు తెలియని వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొని గాయపడ్డాడు. గాయపడిన 108 అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా మధ్య మార్గంలో మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఘటుకేసర్ యార్డు వద్ద ఈ నెల 23న రాత్రి గుర్తు తెలియని యువకుడు రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అతన్ని 108లో తరలిస్తుండగా మృతి చెందాడు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. మృతుని వయసు సూమారు 25-30 సంవత్సరాలు ఉంటాయని, ఒంటిమీద బూడిద రంగు ఫ్యాంట్, స్వేటర్ ధరించి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు మూగ, చెవిటి అని ఘటుకేసర్ రైల్వే స్టేషన్ సమీపంలోని గాంధీనగర్ వద్ద సంవత్సరం నుంచి ఉంటున్నాడని స్థానికులు చేబుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.