అమీర్పేట్, నవంబర్ 2: నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ తీరునే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటా వివరిస్తున్నామని నిరుద్యోగ జేఏసీ ప్రతినిధి సింధూజ తెలిపారు. ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేస్తుంటే, ఉద్యోగాలు ఇవ్వలేని దద్దమ్మ సర్కార్ తమపై భౌతిక దాడులకు గూండాలను ఉసిగొల్పుతుండడం క్షమించరానిదన్నారు. ఆదివారం ఎర్రగడ్డ శాస్త్రీనగర్ హనుమాన్ ఆలయం ఎదుట బడుగు, గిరిజన నిరుద్యోగులపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడులతో ఆ పార్టీ పతనం ప్రారంభమైందన్నారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని, ఓటర్లు మరోసారి మోసపోకుండా కాంగ్రెస్ మోసాలను ఇంటింటికీ చేరవేస్తామని చెప్పారు.