Unemployee | రేవంత్ రెడ్డిని నమ్మి ముఖ్యమంత్రిని చేస్తే రెండున్నరేళ్లు కాలయాపన చేసి ఉద్యోగాలు భర్తీ చేయకుండా తమను మోసం చేశాడని నిరుద్యోగులు మండిపడుతున్నారు. సొంత పార్టీలో పనిచేసిన నేతలే రేవంత్ రెడ్డి ఇంకోసారి అధికారంలోకి రావడం కలనే అని అంటున్నారు. ఓ నిరుద్యోగి మాట్లాడుతూ.. నాపేరు నరేశ్. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం. దేవరుప్పుల మండలం. ఈ మండలంలో నేను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోనే పని చేసి వచ్చిన వ్యక్తిని. ఇప్పటికీ కూడా యశస్విని రెడ్డి పీఏలు నాతో మాట్లాడుతుంటరు. నేను కూడా ఎస్ఐ అభ్యర్థిని. లాస్ట్ టైం బాగా ప్రిపరయ్యా. నా దురదృష్టం కొద్దీ 3 మార్కులతో ఎస్ఐ ఉద్యోగాన్ని మిస్సైన అన్నాడు.
కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే మనకు ఉద్యోగాలొస్తయని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడేమో రెండున్నరేళ్లు కాలయాపన చేసి 5 వేలు ఉద్యోగాలు అంటే ఇంటికి పోయి నా ఫ్యామిలీకి ఏం సమాధానం చెప్పాలి. ఆ 5 వేల పోస్టులకు నేను ప్రయత్నం చేసినా.. మా ఉమ్మడి వరంగల్‌కు కనీసం 100 పోస్టులు కూడా రావని చెప్పుకొచ్చాడు నరేశ్.
నేను రేవంత్ రెడ్డి దగ్గరకు పోయిన.. మీటింగ్‌లకు వెళ్లిన..ఆయనతో ఫొటోలు దిగిన. పాలకుర్తిలో యశస్విని రెడ్డి రాకముందు కాంగ్రెస్ పార్టీ గెలవాలని నా సొంతంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే పిచ్చి. ఏందో మార్పు వస్తదని.. కేసీఆర్‌ని దించి తప్పు చేసాము అనిపిస్తుంది. కేసీఆర్ దగ్గరికి అందరూ పోయి అడిగితే ఏజ్ పెంచాడు.. కానీ రేవంత్ రెడ్డి ఉన్నది కూడా తగ్గిస్తున్నాడు. రేవంత్ రెడ్డిని నమ్మినందుకు మమ్మల్ని ముంచాడు. రేవంత్ రెడ్డి ఇంకోసారి గెలవడన్నాడు.
నేను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోనే పని చేశాను.. ఇంకోసారి రేవంత్ రెడ్డి గెలవడు
కేసీఆర్‌ని దించి తప్పు చేసాము అనిపిస్తుంది
రెండున్నర ఏండ్లు కాలయాపన చేసి 5 వేల ఉద్యోగాలు అంటే నేను మా ఇంటికి పోయి ఏం సమాధానం చెప్పుకోవాలి
ఈ 5 వేల ఉద్యోగాలలో మా ఉమ్మడి వరంగల్ జిల్లాకు 100… https://t.co/SD1UE0DUB4 pic.twitter.com/buG9kyBxqz
— Telugu Scribe (@TeluguScribe) July 16, 2026